..
శంకరపట్నం: జనం సాక్షి మార్చి 24
అంగన్వాడి సేవలు అర్హులైన ప్రతి ఒక్కరు వినియోగించుకుని ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందాలని కన్నాపూర్ అంగన్వాడీ టీచర్ గాజుల కాంత సూచించారు. శుక్రవారం కన్నాపూర్ అంగన్వాడీ సెంటర్ లో పోషన్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామములోని గర్భిణీ స్త్రీలకు చంటి పిల్లల తల్లులకు చిన్నారులకు పోషక ఆహారం పై అవగాహన కల్పించి అంగన్వాడి సేవలపై వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు కాటం రాజమణి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, గర్భిణీ స్త్రీలు చంటి పిల్లల తల్లులు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడి సేవలు వినియోగించుకోవాలి.. టీచర్ గాజుల కాంత.




