Wednesday, 4 November 2026

తెలంగాణ రజక వృత్తి దారుల రాష్ట్ర3వ మహాసభల ఆహ్వానం

తెలంగాణ రజక వృత్తి దారుల రాష్ట్ర3వ మహాసభల ఆహ్వానంకొడకండ్ల, మార్చి24 (జనం సాక్షి) జనగామ జిల్లా కేంద్రంలో హైదరాబాద్ రోడ్డులోని విజయ ఫంక్షన్ హల్ లో 2023 మార్చి26 రోజున తెలంగాణ రజక వృత్తి దారుల సంఘం రాష్ట్ర 3వ మహాసభలు పోరాటాల పురిటిగడ్డ జనగామ లో జరుపుకొనుటకు ఆహ్వాన సంఘం ఏర్పాటుకు సమావేశం నిర్వహిస్తున్నామని తెలంగాణ రజక వృత్తి దారుల సంఘం జనగామ జిల్లా అధ్యక్షులు మైలారపు వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎదునూరి మదార్ కొడకండ్ల  జెడ్పిపిఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రజక వృత్తి దారుల సంఘం రాష్ట్ర నేతలతో పాటు వివిధ సామాజిక సంఘాలకు చెందిన ప్రముఖులు, శ్రేయోభిలాషులు హాజరవుతున్నారని రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీ కొడకండ్ల రజక సంఘాన్ని ఆహ్వానిస్తున్నదని తెలిపారు. ఈ సమావేశంలో రజక సంఘం కొడకండ్ల పట్టణ అధ్యక్షులు సట్టు సోమయ్య, ప్రధాన కార్యదర్శి దూదిగాని నాగరాజు, కోశాధికారి తాడూరి రాములు,ముఖ్య సలహాదారులు రెడ్డిరాజుల గురువయ్య, రాపోలు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.