అంగన్ వాడీ లపై బడ్జెట్ లో వరాల జల్లు కురిపించారు ఈటెల. అంగన్ వాడీ కార్యకర్తల నెల జీతాన్ని 4200 నుంచి ఒక్కసారిగా 7 వేలకు పెంచారు. అంగన్వాడీ సహాయకులకు 2450 నుంచి 4500 రూపాయలకు జీతాన్ని పెంచారు. ఇక అంగన్ వాడీ కేంద్రాల్లో వంటపాత్రల కొనుగోలు కోసం ప్రతీ కేంద్రానికి 1000 రూపాయలు కేటాయించారు. ఐసీడీఎస్ పథకానికి 771 కోట్లు కేటాయించారు.




