Thursday, 5 November 2026

హోంగార్డుల బకాయి వేతనాల విడుదల

హోం గార్డులకు ఒక గొప్ప శుభవార్త. జంట కమిషనరేట్లు మినహా అన్ని జిల్లాల్లోని హోంగార్డులకు జీతభత్యాలు చెల్లించడానికి నిధులను విడుదల చేస్తూ డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, ఖమ్మం, మహబూబ్నగర్, నిజామాబాద్, వరంగల్ అర్బన్, రూరల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో పనిచేస్తున్న హోంగార్డుల జీతభత్యాల చెల్లింపు కోసం నిధులను విడుదల చేస్తున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. మూడు నెలలుగా ఉన్న రూ.9.90 కోట్ల బకాయిలను నేడు విడుదల చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *