Wednesday, 4 November 2026

అంగన్ వాడి కేంద్రానికి 30 వేల విలువ ఫర్నీచర్ వితరణ చేసిన ఎంపి వద్దిరాజు

అంగన్ వాడి కేంద్రానికి 30 వేల విలువ ఫర్నీచర్ వితరణ చేసిన ఎంపి వద్దిరాజు

రఘునాధపాలెం నవంబర్ 29 జనం సాక్షి మండలం జాన్ బాద్ తండా అంగన్ వాడి కేంద్రంలో మౌళిక సదుపాయాలు కల్పించాలని గ్రామస్ధులు ఎంపి వద్దిరాజు రవిచంద్రను ఇటీవల కలిసి విజ్ఞప్తి చేసారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎంపి మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ ను పంపి సమస్య ను తెలుసుకున్నారు. అంగన్ వాడి కేంద్రానికి అవసరమైన 4 పెద్ద బల్లలు , 10 కుర్చీలు , బీరువాను మంగళవారం గ్రామస్ధుల సమక్షంలో అంగన్ వాడి కేంద్రానికి అందజేసారు. 30 వేలు విలువచేసే ఫర్నీచర్ సమకూర్చడం పట్ల హర్షం వ్యక్త పరిచారు.. ఈ కార్యక్రమంలో ఆకుల గాంధీ తో పాటుమున్నూరుకాపు సంఘం నాయకులు రాజోలు నరసింహారావు, టిపియుఎస్ జిల్లా అధ్యక్షుడు మత్తి వెంకటేశ్వర్లు ,సర్పంచ్ మాలోత్ పద్మ,ఎంపిటిసి కళింగ రెడ్డి, ఉప సర్పంచ్ బుక్యా సాల్క్, పంచాయతీ కార్యదర్శి జ్యోతి, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బోడా భీమా, మాత్యశాఖ అధ్యక్షుడు బాణోత్ కిషన్,అంగన్ వాడి టీచర్ విజయా,వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.