Tuesday, 3 November 2026

అంగన్ వాడీ కేంద్రంలో  గ్రాడ్యుయేషన్ డే

 

మల్లాపూర్, ఏప్రిల్ 29:  (జనం సాక్షి)మండలంలోని సాతారం గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలను స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్లు , భారతి శంకరమ్మ మాట్లాడుతూ పిల్లల జీవితంలో మొదటి ఆరు సంవత్స రాలు చాలా కీలక దశ అని, ఈ దశలో పిల్లలకు అందించే ప్రేరణ, అనుభవాలు వారి భవిష్య త్తుకు సంపూర్ణ అభివృద్ధికి వ్యక్తిత్వ వికాశానికి పునాది వేస్తుందని పేర్కొన్నా రు. పూర్వ ప్రాథమిక విద్య ప్రాముఖ్యత, పౌష్టికాహారం ప్రాధాన్యతా, గూర్చి తల్లులు, చిన్నారులకు అవగాహన కల్పించారు. అనంతరం  అంగన్వాడి టీచర్లు పిల్లల బరువులు తూకం వేయడం, పిల్లల ప్రోగ్రెస్ రిపోర్డులను పంపిణీ చేశారు.. త్రీప్లస్, ఫోర్ ప్లస్ పిల్లలకి అభివృద్ధి మైలురాళ్లు అనగా పిల్లల మానసిక కండరాల అభివృద్ధి మేదో వికాసం, పిల్లల ఎదుగుదల చూస్తూ పిల్లల ఆటపాటలతో ప్రీస్కూల్ విద్యను అసెస్మెంట్ కార్డులో ఇచ్చారు . కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు మమతా రాణి ,అన్నపూర్ణ, వనిత ,శ్రీలత, సంధ్య రాణి, వకుల ,భవాని, రాధా ఇంద్ర, కృష్ణవేణి , ఆయా గ్రామాల అంగన్వాడి టీచర్లు ఆయ