బచ్చన్నపేట ఏప్రిల్ ( జనం సాక్షి)) చదువు . క్రమశిక్షణ విషయంలో అంగన్వాడి టీచర్ల సేవలు చెప్పుకోదగ్గవని జనగామ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ గిర బోయిన భాగ్యలక్ష్మి అంజయ్య అన్నారు. శుక్రవారం బచ్చన్నపేట లోని బీడీ కాలనీ. మండలంలోని గోపాల్ నగర్ . కొన్నే. గ్రామాల్లోని అంగన్వాడి సెంటర్లో పిల్లల అభివృద్ధి పుస్తకంపై తల్లిదండ్రులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పీ వైస్ చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మి. స్థానిక సర్పంచ్ పర్వతం మధు ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ . బాల్య దశలో చిన్నారులు ఆటపాటలతో విద్యను అభ్యసించి అంగన్వాడి సెంటర్లో . మూడు సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వయసు వరకు చదువుకొని వెళ్తున్న చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు. అంగన్వాడి సెంటర్ లో బాల్యం నుంచే చిన్నారులకు మంచి అలవాట్లు, ఆరోగ్యంతో ఉండాల్సిన అలవాట్లను నేర్పించాల్సిన అవసరం అంగన్వాడీల పాత్ర ఎంతో ఉందని అన్నారు. అంగన్వాడి సెంటర్లో లబ్ధిదారులకు అందుతున్న సేవలను తల్లులకు వివరించారు. అంగన్వాడి సెంటర్లో టీచర్లు పిల్లలకు ఆటపాటలతో పూర్తి స్వేచ్ఛ వాతావరణం లో విద్యను బోధించడం జరుగుతుందని తల్లులకు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ ఎల్ కవిత. అంగన్వాడీ టీచర్స్ పస్తం లక్ష్మి. సిహెచ్ భాగ్య. కొన్నే అంగన్వాడీ టీచర్స్. ఉషారాణి. విజయ. పద్మ. బీడీ కాలనీ అంగన్వాడీ టీచర్స్ గణపురం కవిత. ఆయా రాజశ్రీ. ఆశ మల్లిక. ఉప సర్పంచ్ వద్ది ఎల్లయ్య. వార్డ్ మెంబర్స్ బొమ్మ నర్సింలు. పస్తం కనకమ్మ. జాన్. ప్రసన్న. యూత్ మెంబర్స్. పి భాస్కర్. జి ఐలయ్య. అంజి. కే శ్రీధర్. పిల్లల తల్లిదండ్రులు. ఆయాలు అంబవ్వ. పి ఆదిలక్ష్మి ఉన్నారు




