Wednesday, 4 November 2026

అంగరంగ వైభవంగా రైతు దినోత్సవ వేడుకలు కడవెరుగు క్లస్టర్ ఏ ఈ ఓ సమాజాత

 

చేర్యాల (జనంసాక్షి) జూన్ 03 : చేర్యాల మండలంలోని కడవేరుగు గ్రామంలో రైతు వేదికలో కన్నుల పండుగగా, వైభవంగా రైతుల దినోత్సవం జరిగిందని ఏఈఓ సమాజాత తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతుబంధు, రైతు బీమా రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. గతంలో వ్యవసాయం చేయాలంటే పెట్టుబడి లేక అనేక ఇబ్బందులు ఉండవని రైతుబంధు సాయంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు అంతేగాక కుటుంబ యజమాని చనిపోతే కుటుంబానికి ఎంతో భారం ఉండేది రైతు బీమా తో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. రైతులంతా పంట మార్పిడి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో కడవేరుగు, పోతిరెడ్డిపల్లి గ్రామ రైతులు సుమారు 300 మంది పాల్గొన్నారు.