Wednesday, 4 November 2026

బడిబాట కార్యక్రమం -నేటి నుంచి శ్రీకారం

జనం సాక్షి దుబ్బాక …సకల సౌకర్యాలతో డిజిటల్ తరగతులతో కార్పొరేట్ విద్యను అందిస్తున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల దుబ్బాక ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు మన ఊరు మన బడి మన బస్తి మనబడి పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల దుబ్బాక కేసీఆర్ స్కూల్లో ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమం జూన్ 3 నుండి 17 వరకు, మొదటి విడత బడిబాట కార్యక్రమం నేటి నుండి 9వ తేదీ వరకు పాఠశాల ఆవాసము లోని విద్యార్థుల యొక్క డోర్ టు డోర్ క్యాంపెయిన్, కావున పాఠశాల ఆవాసంలోని బాలురతో పాటు బాలికలు చేరుటకు ప్రాముఖ్యత ఇచ్చి బడిలో చేర్చడము, మా పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలతో పాటు ఈ సంవత్సరం నుండి ఉచితంగా నోట్ బుక్స్ పంపిణీ, రెండు జతల ఏకరూప దుస్తులు, విద్యార్థుల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ – హెల్త్ చెకప్ లు, పౌష్టికాహారంకూడిన మిను ప్రకారము మధ్యాహ్న భోజనము, ఎస్సీ, ఎస్టీ ,బీసీ ,మైనార్టీ, బీడీ స్కాలర్షిప్ల సదుపాయం కలదు. ఈ సంవత్సరం నుండి 8,9,10 తరగతుల విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ స్మార్ట్ క్లాసులు నిర్వహించడం జరుగును, మా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య బోధన అందించుటకు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు కలరు. మొదటి విడత బడిబాట విద్యార్థుల ఎన్రోల్ డ్రైవ్ ను పాఠశాల హెచ్ఎం గాజుల రామచంద్రం ఆధ్వర్యంలో ఈరోజు పాఠశాల ఆవాసములోని హరిజనవాడలో, డబుల్ బెడ్ రూమ్ కాలనీలలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో భాగంగా పాల్గొన్న మున్సిపల్ కో – ఆప్షన్ మేంబర్ ఆస స్వామి, పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ కట్కూరి రామచంద్రం, పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు గడ్డం బాలకిషన్, మిగతా ఉపాధ్యాయులు రాపల్లి రమేష్ బత్తుల బాలయ్య, మంచినీళ్ల సరస్వతి, సునీత, ఉజ్వల, పద్మ, సంధ్యారాణి, మహేందర్, రామకృష్ణ, యాదగిరి తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.