ధర్మపురి 12 ఆదివారం (జనం సాక్షి) జగిత్యాల జిల్లాలోని దక్షిణ కాశీగా పేరొందిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం మువ్వురు స్వాముల రథోత్సవం ఘనంగా జరిగింది. రథోత్సవం సందర్భంగా ఉదయం నుండి వేద పండితులు, అర్చకులు లక్ష్మీనరసింహస్వామి,వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ స్వామి వారిని దర్శించుకున్నారు,భక్తులు అధిక సంఖ్యలో అభిషేకం, పూజా కార్యక్రమాలలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులు స్వామివార్లను దర్శించుకునేందుకు వీలుగా ఉత్సవమూర్తులను సుందరంగా పుష్పాలంకరణ చేసిన రథాలపై ఉంచారు. భక్తులు స్వామి వార్ల రథాల వద్ద కొబ్బరికాయలు కొట్టి స్వామి వార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల కోలాహలం,జయ జయ ద్వానాలు,గోవింద నామస్మరణల నడుమ స్వామి వార్ల రథోత్సవం దేవాలయ ప్రాంగణం నుండి నంది చౌక్ వరకు అంగరంగ వైభవంగా జరిగింది. రథోత్సవ మార్గంలో భక్తులు మంగళ హరతులతో స్వామి వార్లకు ఘనస్వాగతం పలికారు.అధిక సంఖ్యలో భక్తులు స్వామి వార్లను దర్శించుకోవడానికి గుమిగుడారు. రాత్రి 7 గంటలకు చక్రతీర్థం మరియు శ్రీలక్ష్మీనరసింహస్వామి(యోగ) వారి పుష్పయాగం ఘనంగా జరిగింది.అనంతరం శేషప్ప కళా వేదిక పై వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు, భక్తులు సాంస్కృతిక కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులకు స్థానిక బ్రాహ్మణ సంఘంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు నిర్వహించారు.జిల్లా ఎస్పి భాస్కర్, డిఎస్పి ప్రకాష్ ఆదేశానుసారం కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టినట్లు సిఐ కోటేశ్వర్ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక పార్కింగ్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఎస్ ఐ కిరణ్ తెలిపారు. ఈ రథోత్సవం కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి సంకుటాల శ్రీనివాస్, రేనోవేషన్ సభ్యులు ఇందారపు రామన్న,అక్కేనపెల్లి సురేంధర్,వీరవేని కొమురయ్య,చుక్క రవి, స్తంభంకాడి మహేష్,ఇనుగంటి రమ వెంకటేశ్వరరావు,గునిశెట్టి రవీంధర్,పల్లెర్ల సురేంధర్,గుంపుల రమేష్, వేముల నరేష్,జైన రాజమౌళి,సంగెం సురేష్,గందె పద్మ శ్రీనివాస్,డిసిఎంఎస్ ఛైర్మెన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సంగి సత్తెమ్మ,జడ్పిటిసి బత్తిని అరుణ, ఎంపిపి చిట్టి బాబు, ఎఎంసి ఛైర్మెన్ అయ్యోరి రాజేష్, ఎఎంసి వైస్ చైర్మన్ అక్కేనపెల్లి సునీల్, తహశీల్దార్ వెంకటేష్, కమిషనర్ రమేష్, డిపిఆర్వో దశరథం,కొండయ్య ధర్మపురి,
ధర్మపురి పరిసర ప్రాంతాలతో పాటు, సుదూర ప్రాంతాలైన మహారాష్ట్ర,నిజామాబాద్, ఆర్మూర్,నిర్మల్ వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.




