ముత్యాలంపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1975-83
టేకులపల్లి, మార్చి 12( జనం సాక్షి ): టేకులపల్లి మండలం ముత్యాలంపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1975-83 వరకు విద్యాభ్యాసం చేసిన ఆనాటి విద్యార్థులు అందరూ వివిధ ప్రాంతాలలో, వివిధ హోదాలలో జీవితాలను గడుపుతున్న ఆనాటి విద్యార్థులు, విద్యను నేర్పిన ఆనాటి గురువులు ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 43 ఏళ్ల తర్వాత ఒకరిని ఒకరు కలుసుకోవడం, గత స్మృతులను నెమరు వేసుకుని వారి వయస్సును కూడా మరిచిపోయి ఎంతో ఆప్యాయంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఇక్కడ ఎంతో ఉత్సాహంగా గడిపారు. 1975-76 నుంచి 1982-83 వరకు పదో తరగతి చదువుకున్న అప్పటి విద్యార్థులందరూ తాము చదువుకున్న పాఠశాల ఆవరణలో అపూర్వంగా కలుసుకున్నారు. ఆయా సమయాల్లో తమకు పాఠాలు బోధించిన ఉపాధ్యాయులను ఆహ్వానించి ఘనంగా సన్మానించుకున్నారు. తమకు బోధించిన ఉపాధ్యాయులే కాకుండా, ఆయా సమయాల్లో చదువుకున్న విద్యార్థులు కూడా వివిధ వృత్తుల్లో స్థిరపడి, కొందరు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ, ఉద్యోగం విరమణ కూడా చేసిన వారు ఉండటం విశేషం. ఆ సమయంలో బోధించిన ఉపాధ్యాయుడు కోటేశ్వరరావు, పి ఈ టి రాజు, మరో ఉపాధ్యాయుడు జేమ్స్ లను పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కలయకుకు మూలం 1980-81 సంవత్సరంలోని పదో తరగతి చదువుకున్న ఓ విద్యార్థి కుమారుని వివాహ వేడుకల్లో కలుసుకోవడంతో పూర్వ విద్య విద్యార్థుల సమ్మేళనానికి పునాది పడింది. వెనువెంటనే వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి తెలిసిన వారి మరికొందరు తెలిసే విధంగా నెంబర్లు యాడ్ చేసి రెండు నెలల వ్యవధిలోనే కలయికకు తేదీ నిర్ణయించుకొని సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. అప్పుడు బోధించిన అనేకమంది ఉపాధ్యాయులని ఆహ్వానించారు. తాము చదువుకున్న రోజుల్లో స్థితిగతులు, బోధన




