Tuesday, 3 November 2026

*అండగా ఉంటా అధైర్యపడొద్దు పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

లింగంపేట్ 07 ఆగస్టు (జనంసాక్షి)
లింగంపేట్ మండలంలోని నల్లమడుగు గ్రామంలొ ఆదివారం పలు కుటుంబాలను ఎమ్మేల్యే సురెందర్  పరామార్శించారు.గత ఐదు రోజుల క్రితం వ్యవసాయ పొలంలో ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతంతో మరణించిన కొండ రాజులు కుటుంబాన్ని ఎమ్మెల్యే సురేందర్ వారింటికి వెళ్లి పరామర్శించారు.అలాగే అనారోగ్యంతో చనిపోయిన నిమ్మల పద్మ కుటుంబాన్ని పరామర్శించి వారికి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు వీరి వెంట టిఆర్ఎస్ నాయకులు గ్రామస్తులు ఉన్నారు.