అండర్ 17 క్రికెట్ పోటీలలో సత్తా చాటిన మొలంగూర్ వాసి…
శంకరపట్నం: జనం సాక్షి నవంబర్ 30
జాతీయ స్థాయి క్రికెట్ పోటీలలో
మొలంగూర్ వాసి. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామానికి చెందిన సుంకర రత్నమాల రత్న ప్రసాద్ దంపతుల కుమారుడు సుంకర సాయి వర్మ హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామంలో గల ఏకశిలా పాఠశాలలో 9వ తరగతి విద్యను అభ్యసిస్తున్నాడు. సాయి వర్మ మొదటి నుండి క్రికెట్ పై మక్కువ పెంచుకొని, క్రికెట్ పోటీలలో అత్యంత ప్రతిభ కనబరుస్తూ గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రసయితోపాటు, ఈనెల 26, 27, 28వ తేదీలలో అండర్ 17 క్రికెట్ జాతీయస్థాయి పోటీలను ఆంధ్ర ప్రదేశ్ లోని మచిలీపట్నంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి క్రికెట్ పోటీలలో హర్యానా జట్టుపై తెలంగాణ జట్టు విజయం సాధించగా, సాయి వర్మ అత్యంత క్రీడా ప్రతిభ కనబరిచి, క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించగా ఆయన క్రీడా నైపుణ్యానికి నిర్వాహకులు గోల్డ్ మెడల్ అందజేశారు. జాతీయ క్రీడా పోటీలలో గోల్డ్ మెడల్ సాధించిన సాయి వర్మను గ్రామ సర్పంచ్ మోరె అనూష శ్రీనివాస్, ఎంపీటీసీ ఎస్ కె మోయిన్, మాజీ సర్పంచ్ రాయిని శంకరయ్య, దండు సాయిలు, నరహరి శారదా బుచ్చిరెడ్డి, మరాఠీ వెంకటేశ్వర్లు, తోపాటు గ్రామస్తులు అభినందించారు
అండర్ 17 క్రికెట్ పోటీలలో సత్తా చాటిన మొలంగూర్ వాసి




