రేపు మునుగోడుకు ఐదుగురు మంత్రులురేపు మునుగోడుకు ఐదుగురు మంత్రులు
మునుగోడు అభివృద్ధి, సంక్షేమ పనులపై సమీక్ష
(హైదరాబాద్, నవంబర్ 30)
తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా ఆవిర్భవించిన తర్వాత వచ్చిన తొలి ఉప ఎన్నిక మునుగోడులో ముఖ్యమంత్రి కేసిఆర్ గారి నాయకత్వంలో విజయదుందుబి మోగించింది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యతిరేక బిజెపి అహంకారాన్ని, తెలంగాణపై ఆ పార్టీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేవిధంగా మునుగోడు ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం ఉమ్మడి నల్గొండ జిల్లా, మునుగోడు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి కేసిఆర్ గారి ఆదేశాల మేరకు ఐదుగురు మంత్రులు కేటిఆర్, జగదీశ్వర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రశాంత్ రెడ్డి రేపు(01.12.2022) మునుగోడులోని ధనలక్ష్మీ ఫంక్షన్ హాల్ ఉదయం 11 గంటలకు సమీక్షించనున్నారు.
దయచేసి కవర్ చేయగలరు
రేపు మునుగోడుకు ఐదుగురు మంత్రులురేపు మునుగోడుకు ఐదుగురు మంత్రులు




