Tuesday, 3 November 2026

అంతర్గత రహదారులకు మహర్దశఅంతర్గత రహదారులకు మహర్దశ*రు.63 లక్షల వ్యయంతో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే హరిప్రియ 

టేకులపల్లి, ఫిబ్రవరి 25( జనం సాక్షి ): టేకులపల్లి మండలంలోని రామచంద్ర పేట గ్రామంలో సిసి రోడ్లుకు శనివారం ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ శంకుస్థాపన చేశారు. ఈజీఎస్ నుండి నిధులు  6 అంతర్గత రహదారులకు రు.30 లక్షలు, డి ఎం ఎఫ్ టి  నుండి 7 రోడ్లు  రు.33 లక్షలు నిధులు మంజూరు అయ్యాయి. ఎమ్మెల్యే హరిప్రియ చేతుల మీదుగా సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ  ముఖ్యమంత్రి కెసిఆర్  ప్రతి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపే దిశగా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాలకు బాటలు వేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల  ప్రజా పరిషత్ అధ్యక్షురాలు  భూక్య రాధా, టేకులపల్లి బిఆర్ఎస్  పార్టీ మండల అధ్యక్షులు బొమ్మెర్ల వరప్రసాద్, రామచంద్ర పేట సర్పంచ్ ఈసాల ఉపేందర్, బోడు సర్పంచ్ ఇర్ఫా   లక్ష్మీనారాయణ,  పార్టీ మండల ఉపాధ్యక్షులు చీమల సత్యనారాయణ, నాయకులు భూక్య సైదులు, పోతుగంటి వీరభద్రం, గంగాధర్, శ్రీను, సమ్మయ్య ,కృష్ణ,పాపయ్య, వెంకటేశ్వర్లు ముత్తయ్య ,జగన్నాథం, తదితరులు పాల్గొన్నారు.