అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గాయి

` కేంద్రానిది ఇంధన దోపిడీ
` పెట్రో ధరలు వెంటనే తగ్గించండి
` మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌
` బిజెపి విధానాలతో ప్రజలు కష్టాలపాలవుతున్నారని ధ్వజం
హైదరాబాద్‌(జనంసాక్షి): అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గుతున్న నేపథ్యంలో ప్రజలపై పెట్రో భారాన్ని తగ్గించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. తగ్గిన ముడిచమురు ధరల మేరకు పెట్రో రేట్లు తగ్గించాలని మోదీని డిమాండ్‌ చేశారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పెట్రోల్‌ ధరలు అమాంతం పెరిగిపోయాయని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా దేశంలో మాత్రం పెట్రో దోపిడీ ఆగడం లేదన్నారు. ప్రస్తుతం ముడి చమురు బ్యారల్‌ ధర 95 డాలర్లకు తగ్గినా, పెట్రో రేట్లను తగ్గించడం లేదని కేటీఆర్‌ మండిపడ్డారు. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారమే దేశ ప్రజల నుంచి రూ. 26 లక్షల కోట్లకు పైగా కేంద్రం వసూలు చేసిందని కేటీఆర్‌ తెలిపారు. ఈ పెట్రో పన్నులను ప్రజల నుంచి గుంజి, కార్పోరేట్ల రుణాల మాఫీకి వాడుకుంటున్నదని కేటీఆర్‌ పేర్కొన్నారు. చట్టాన్ని మార్చుకుని మరీ సెస్సులు, సుంకాల పేరుతో భారీగా దోపిడీ చేస్తున్నదని ్గªర్‌ అయ్యారు. ఆ నెపాన్ని రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటిదాకా పెట్రోల్‌ పైన ఒక్క రూపాయి అదనపు పన్ను వేయని తెలంగాణ లాంటి రాష్ట్ర ప్రభుత్వాలపైకి నెడుతున్నదని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన కొండంత ధరలను నామ మాత్రంగా తగ్గించి, పేదల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నదని, ఇది ముమ్మమాటికీ నయవంచనకు పరాకాష్టనే అని కేటీఆర్‌ అన్నారు. దేశంలో ఏర్పడిన దుర్భర ద్రవ్యోల్బణ పరిస్థితులు, కరోనా సంక్షోభ నేపథ్యంలో పెట్రో ధరలను వెంటనే తగ్గించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. తన అసమర్థ విధానాలు, పరిపాలనతో దేశ ప్రజలను దోపిడీ చేస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా పెట్రో పన్నుభారం నుంచి భారత దేశ ప్రజలకు కాస్తయినా విముక్తి కలిగించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు వంద డాలర్లకు కన్నా దిగువకు భారీగా తగ్గుతున్నా, ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఆమేరకు పెట్రో భారాన్ని ప్రజలపై తగ్గించేందుకు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. మోదీ నాయకత్వంలోని కేంద్రం, పెట్రో ధరల పెరుగుదలకు అంతర్జాతీయ ముడిచమురు ధరలు కారణమంటూ చేస్తున్న వాదనలో డొల్లతనం ఇప్పుడు మరోసారి బయటపడుతున్నదన్నారు కేటీఆర్‌. మోదీ అధికారం లోకి వచ్చినప్పటి నుంచి బ్యారెల్‌ ముడి చమురు ధర భారీగా తగ్గుతూనే వచ్చిందని, కానీ ఘనమైన మోదీ పాలనలో, దేశంలో పెట్రో రేట్లు మాత్రం పెరుగుతూ పోయాయన్నారు. రేట్లు పెంచిన ప్రతిసారి అంతర్జాతీయ ముడి చమురు ధరలను బూచీగా చూపడం అలవాటుగా మారిందని మండిపడ్డారు. అంతర్జాతీయంగా బ్యారెల్‌ ముడిచమురు ధర తగ్గితే ఆ ప్రయోజనం ఎక్కడ దేశ ప్రజలకు ఇవ్వాల్సి వస్తుందేమోనన్న కుటిల అలోచనతో మోదీ ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకాలను, సెస్సులను భారీగా పెంచుతున్నదని తెలిపారు. 2014 నుంచి ఇప్పటిదాకా పెంచడమే తప్ప తగ్గించడం తెలియదన్నట్టుగా పెట్రో ధరలను మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పదులసార్లు పెంచిందని కేటీఆర్‌ తెలిపారు. కార్పోరేట్లకు పాదసేవ చేస్తూ, జాతి సంపదను అప్పనంగా వారికి కట్టబెడుతూ, దేశంలోని ఒక్కో వ్యవస్థను కబళిస్తూ మోదీ సర్కార్‌ జనాలను పీక్కుతింటున్నదన్నారు. ఇప్పటివరకు పెట్రో పన్నులు, సెస్సుల రూపంలో రూ. 26 లక్షల కోట్లకు పైగా జనం జేబుల నుంచి దౌర్జన్యంగా దోచుకున్న మోదీ ప్రభుత్వం, మరోవైపు బ్యాంకుల నుంచి కార్పోరేట్‌ బడాబాబులు తీసుకున్న రుణాలను మాఫీ చేయడానికి ఆ మొత్తాన్ని ఉపయోగిస్తున్నదన్నారు. మోదీ ప్రేమ కార్పోరేట్‌ కంపెనీలపైననే కానీ, కాయ కష్టం చేసుకునే దిగువ, మధ్యతరగతి వారిపై కాదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. పెట్రో రేట్ల పెరుగుదల అనాటి కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే అని అధికారంలోకి రాకముందు గొంతు చించుకున్న నరేంద్రమోదీ, ఇప్పుడు ధరల పెరుగుదలను ఆపడంలో తాను ఘోరంగా విఫలం అయ్యారని ఒప్పుకుంటారా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. 2014లో మోదీ సర్కారు ఏర్పాటైనప్పుడు బ్యారెల్‌ ముడిచమురు ధర దాదాపు 110 డాలర్లుగా ఉండేదని, 2015 జనవరి నాటికి అది 50 డాలర్లకు, 2016 జనవరిలో అయితే 27 డాలర్లకు పడిపోయిందన్నారు. ఇక 2020లో కరోనా లాక్‌డౌన్‌ అప్పుడు బ్యారెల్‌ ముడిచమురు ధర ఏకంగా 11 డాలర్లకు సైతం పడిపోయిందన్నారు. కానీ దేశంలో మాత్రం మోదీ ప్రభుత్వం ఏనాడు పెట్రో ధరలను ఆ మేరకు తగ్గించిన పాపాన పోలేదన్నారు. కేంద్ర సంస్థల గణాంకాల ప్రకారం అధికారంలోకి వచ్చిన తొలి మూడేళ్లు 2014 మే నుంచి 2017 సెప్టెంబరు మధ్యనే పెట్రోల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ 54 శాతం పెరిగితే, డీజిల్‌ విూద ఏకంగా 154 శాతం పెరిగిందని కేటీఆర్‌ తెలిపారు. పెట్రో ధరలను పెంచి ప్రజల నుంచి భారీగా ఆదాయాన్ని గుంజిన మోదీ సర్కార్‌, దాన్ని మరింత పెంచుకునేందుకు బరితెగించిందన్నారు కేటీఆర్‌. 2020 వరకు పెట్రోల్‌, డిజీల్‌ పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్‌ సుంకాన్ని గరిష్టంగా పెంచుకోవడానికి వీలుగా 2020 మార్చిలో చట్ట సవరణ సైతం చేసిందన్నారు. ప్రజలపై భారం వేసేందుకు చట్టాన్ని సైతం సవరించిన ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీదని కేటీఆర్‌ మండిపడ్డారు. కోవిడ్‌ మహమ్మారితో ఓ వైపు దేశ ప్రజలు ఆర్థికంగా చితికిపోయి ఉన్న సమయంలో కనీస కనికరం లేకుండా మోదీ సర్కార్‌ ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచుకుంటూ పోయిందన్నారు. ఒక అంచనా ప్రకారం 2020 నాటికే మోదీ సర్కారు ఒక్క ఎక్సైజ్‌ డ్యూటీ రూపంలోనే సుమారు రూ. 14 లక్షల కోట్లను ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేసిందన్నారు. సెస్సులు, పన్నుల రూపంలో ఇప్పటిదాకా మెత్తం రూ. 26 లక్షల కోట్లను ప్రజల నుంచి గుంజిన దగాకోరు ప్రభుత్వం మోదీదని కేటీఆర్‌ మండిపడ్డారు. ఇక కేంద్రం పెంచిన ఎక్సైజ్‌ డ్యూటీ నుంచి రాష్టాల్రకు వచ్చేదే చాలా తక్కువన్న కేటీఆర్‌, రాష్టాల్రు ఆర్థికంగా బలహీన పడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న మోదీ సర్కార్‌, పన్నుల రూపంలో కాకుండా సెస్సుల రూపంలోనే ఎక్కువగా పెట్రో రేట్లను పెంచిందని కేటీఆర్‌ తెలిపారు. సెస్సుల రూపంలో ప్రజల నుంచి భారీగా వసూలు చేస్తూ తన ఖజానా నింపుకుంటుందని కేటీఆర్‌ అరోపించారు. కేంద్ర సెస్సులు కాకుండా విధించిన ఒక్క పెట్రో సుంకాలను పూర్తిగా ఎత్తేస్తే ప్రతి లీటర్‌ పైనా ప్రజలకు దాదాపుగా రూ. 30 వరకు ఉపశమనం లభిస్తుందని కేటీఆర్‌ అన్నారు. పెట్రో రేట్లు పెరిగితే అటోమెటిక్‌ గా రవాణా ఖర్చులు కూడా పెరుగుతున్నాయని, అడ్డూ అదుపు లేకుండా మోదీ సర్కార్‌ పెంచిన పెట్రో రేట్లతో నిత్యావసరాల ధరలు పెరిగి దేశ చరిత్రలోనే అత్యధికంగా ద్రవ్యోల్బణం నమోదవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి అన్నారు. పేదోడు దేన్నీ కొనలేకపోతున్నాడని, మధ్యతరగతి బ్జడెట్‌ తలకిందులైందని, పేద, మధ్యతరగతి వర్గాల పరిస్దితులు పూర్తిగా దిగజారిపోయాని కేటీఆర్‌ అవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ తెలిసి కూడా ప్రజల పట్ల కనికరంలేని ప్రధాని మోదీ పెట్రో ధరలు తగ్గించడం లేదన్నారు. పైగా సెస్సులు, సుంకాల పేరుతో దోపిడీ చేస్తూనే, అ నెపాన్ని రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటిదాకా పెట్రోల్‌ పైన ఒక్క రూపాయి అదనపు పన్ను వేయని తెలంగాణ లాంటి రాష్ట్ర ప్రభుత్వాలపైకి నెడుతూ, పేదల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నదని, ఇది నయవంచనకు పరాకాష్ట అన్నారు. ప్రస్తుతం ముడి చమురు బ్యారల్‌ ధర 95 డాలర్లకు తగ్గినా, పెట్రో రేట్లను తగ్గించడం లేదనని కేటీఆర్‌ తెలిపారు. ప్రస్తుతం దేశ ప్రజలు ఎదుర్కొంటున్న దుర్భరమైన ద్రవ్యోల్బణ పరిస్థితులు, కరోనా, లాక్‌ డౌన్‌, కేంద్ర ప్రభుత్వ విఫల విధానాల ఫలితంగా ఉపాధులు కోల్పోయిన ఉన్న నేపథ్యంలో వెంటనే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ పైన ఉన్న అన్ని రకాల సెస్సులను రద్దు చేసి పెట్రో ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు.

(విద్వేషాలు,అధర్మం,ఉన్మాదం ఏ భాజపా
` ఇదే కదా మీకు తెలిసింది
` మంత్రి కేటీఆర్‌ ఫైర్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోదీ ప్రభుత్వం కాదని.. ఇది అటెన్షన్‌ డైవర్షన్‌ ప్రభుత్వమని విమర్శించారు. అసలు దేశ సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర జరుగుతోందన్నారు. మండిపోతున్న పెట్రో ధరల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్రేనని కేటీఆర్‌ ఆరోపించారు. భారమవుతున్న నిత్యవసరాల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర అని, ఊడిపోతున్న ఉద్యోగాల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర అన్నారు. ఈ కుట్రను కనిపెట్టకపోతే.. దేశానికే, భవిష్యత్‌ తరాలకు కోలుకోలేని నష్టమన్నారు.దేశం కోసం.. ధర్మం కోసం.. అనేది బీజేపీ అందమైన నినాదమని, విద్వేషం కోసం.. అధర్మం కోసం.. అనేది అసలు రాజకీయ విధానమని ఆరోపించారు. హర్‌ ఘర్‌ జల్‌ అన్నారు కానీ.. హర్‌ ఘర్‌ జహర్‌ (విషం) అనీ.. ప్రతి మనసులో విషయాన్ని నింపే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. పచ్చగా ఉన్న తెలంగాణాలో చిచ్చు పెట్టె చిల్లర ప్రయత్నం జరుగుతోందని, విష ప్రచారాలతో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. సోషల్‌ విూడియా ద్వారా దేశంలోని.. సోషల్‌ ఫ్యాబ్రిక్‌ను దెబ్బతీసే కుతంత్రం జరుగుతోందన్నారు. ద్వేషం కాదు.. దేశం ముఖ్యమని, ఉద్వేగాల భారతం కాదు.. ఉద్యోగాల భారతం ముఖ్యమని గుర్తుంచుకోవాలని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

తాజావార్తలు