Thursday, 5 November 2026

అంతర్జాతీయ మాతృమూర్తి దినోత్సవ వేడుకలు లో శ్రీ గణేష్

 

 

 

 

 

 

కంటోన్మెంట్ జనం సాక్షి మే 13 కంటోన్మెంట్ నియోజకవర్గం బాలంరాయి అంబేద్కర్ సొసైటీ లో ఈ రోజు బిఅర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీ గణేష్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృమూర్తి దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు మాతృమూర్తు లతో కలసి కేక్ కట్ చేసారు.కార్యక్రమానికి హాజరైన మాతృ మూర్తులకు చీరలను కానుకగా అందజేశారు.ఈ సందర్భంగా శ్రీ గణేష్ మాట్లాడుతూ నవమాసాలు మోసి తన ప్రాణాలు ఫణంగా పెట్టి అమ్మ జీవం పోస్తుందని తమ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుతుందని అన్నారు.భగవంతుడు అన్ని చోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడు,అమ్మలకందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పి కార్యక్రమానికి హాజరైన అమ్మలందరికి శ్రీ గణేష్ పాదాభివందనం చేశారు. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మాతృమూర్తి దినోత్సవం సందర్భంగా పలు సేవ కార్యక్రమాలు. ఉచిత ఆరోగ్య పరీక్ష శిబిరాలు నిర్వహిస్తున్నట్లు శ్రీ గణేష్ తెలిపారు.అమ్మ చల్లని దీవనాలే మనకు శ్రీ రామరక్ష అని అన్నారు. ఈ కార్యక్రమంలోఎల్.విజయలక్ష్మి సి.సత్తమ్మ లలిత, యాదమ్మ, కనకలక్ష్మి, మాణెమ్మా జి. సుశీల,యదమ్మా, జ్యోతి, శైలజ, మల్లేష్, శరత్, కిరణ్ లీకెష్, సౌమ్య,శారదా తదితరలు పాల్గొన్నారు.