Thursday, 5 November 2026

జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వం వెంటనే వెంటనే రాజీనామా చేయాలి వైయస్సార్ తెలంగాణ పార్టీ వికారాబాద్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఉప్పరి ప్రసాద్

 

 

 

 

 

వికారాబాద్ రూరల్ మే 13 జనం సాక్షిగ్రామపంచాయతీ కార్యదర్శులు గత 15 రోజులుగా నిలవధిక సమ్మె నిర్వహిస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం వికాకరమని కార్యదర్శులు సమస్యలు పరిష్కారం తీయని బి ఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని వైయస్సార్ తెలంగాణ పార్టీ వికారాబాద్ నియోజకవర్గం కోఆర్డినేటర్ ఉప్పరి ప్రసాద్ డిమాండ్ చేశారు శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఆత్మహత్య చేసుకున్న పంచాయతీ కార్యదర్శి సోనీ ఆత్మకు శాంతిగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ఆమెకు జోహార్లు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 16 రోజులుగా గ్రామపంచాయతీ కార్యదర్శులు సమ్మె చేస్తుంటే గ్రామాల్లో పారిశుద్ధ్యం అభివృద్ధి పొంటుపడి గ్రామాలన్నీ పెంటకుప్పల్లా మారాయని ఆయన ఆవేదన చేశారు బంగారు తెలంగాణ అంటే జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు రక్షణ లేకుండా పోయిందని ఆయన హేళన చేశాడు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కి ముఖ్యమంత్రి కేసీఆర్ కాలయాపన చేస్తూ కాలం గడుపుతున్నారని వెంటనే కార్యదర్శిలకు విధుల్లోకి తీసుకొని ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు లేనిపక్షంలో బి ఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు వరప్రసాద్ కోటిపల్లి మండల పార్టీ అధ్యక్షులు విట్టల్ చారి క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు బందయ్యా మీ యూనియన్ నాయకుల పేర్లు చెప్పండి జిల్లాలోని అన్ని మండలాల గ్రామాల జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు