ముఖ్య అతిధులుగా హాజరైన మహిళ ప్రతినిధులు..
చిలప్ చేడ్/మర్చి/జనంసాక్షి :- మండలంలోని అంతారం గ్రామంలో గ్రామ సర్పంచ్ అశోక్ గౌడ్ అధ్యక్షతన అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎంపీపీ వినోద దుర్గారెడ్డి,డిడబ్ల్యూఓ బ్రహ్మాజీ,సీడీపీఓ హేమాభార్గవి,డాక్టర్ మాధవి గైనకాలజిస్టు,హాస్టల్ వెల్పేర్ ఆఫీసర్ గాయత్రీ హాజరయ్యారు.ముందుగా గ్రామా సర్పంచ్ అశోక్ గౌడ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా సీడీపీఓ హేమాభార్గవి మాట్లాడుతూ..మహిళలు అన్ని రంగాల్లో రాణించి తమ ప్రతిభను చాటుకోవాలన్నారు.మారుతున్న కాలానికి అనుకూలంగా మహిళలు చైతన్యం కావాల్సిన అవసరం ఉందన్నారు.తదనంతరం సర్పంచ్ అశోక్ గౌడ్ మాట్లాడుతూ..ప్రతి రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి,వారి హక్కుల గురించి మహిళలకు అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టిందని అన్నారు.అర్ద్భాగమైన మహిళలు సమానత్వం కోసం మగవారితో పోటీపడాలన్నారు.ఈ కార్యక్రమంలో చిలిపిచేడ్ మండల ఫోరమ్ అధ్యక్షురాలు లక్ష్మి దుర్గారెడ్డి,ఫైజాబాద్ సర్పంచ్ మనోహర నర్సింహారెడ్డి,శీలంపల్లి సర్పంచ్ కవిత ముకుందరెడ్డి,ఉపసర్పంచ్ నరహరి,కార్యదర్శి రవిశంకర్ రెడ్డి,వార్డు మెంబర్లు స్నేహలత కృష్ణగౌడ్,పెంటమ్మ,సోని,చెన్నయ్య,లస్కర్,మహిళలు,యువకులు పాల్గొన్నారు..




