Wednesday, 4 November 2026

మహిళలు ఆకాశంలో సగం అవనిలో సగం

 

 

 

 

 

బహుజన సమాజ్ పార్టీ తుకారాం

బిచ్కుంద మార్చి 08 (జనంసాక్షి) మహిళలను ఆకాశంలో సగం అవనిలో సగం అంటారని కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ అసెంబ్లీ అధ్యక్షుడు ఈపత్వార్ తుకారాం అన్నారు. బుధవారం నాడు ఖండెబల్లూర్ గ్రామంలో ఘనంగా మహిళల దినోత్సవం జరిపారు. మహిళలను పూలమాలలు వేసి శాలువులతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారత దిశగా నడిపించటం కోసం నిర్వహించే సంబరమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని, ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారని పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుండి పుట్టుకొచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డం నాగేష్, బాబురావు, బేగరి యాదయ్య, బస్వాపూర్, శాంతపూర్ లాలయ్య, రమేష్, విజయ్, పరమేష్, మహిళా సంఘం కార్యకర్తలు నాగవ్వ, బిచ్కుంద చంద్రవ్వ, తక్కడపల్లి శంకరయ్య, బిచ్కుంద లక్ష్మి మరియు మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.