Thursday, 5 November 2026

అంతిమయాత్ర

 నల్లగొండ  :  బంధువు అంత్యక్రియలకు వెళ్తున్న వారికి యమశకటం ఎదురయ్యింది. మార్గంమధ్యలోనే ముగ్గురిని మృత్యువు కబలించింది. మరో ఆరుగురిని మృత్యుముఖంలోకి తీసుకెళ్లింది. నల్లగొండ జిల్లా ఆలేరు దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదం నింపింది. వరంగల్ – హైదరాబాద్ జాతీయ రహదారిపై ఖాళీ గ్యాస్ సిలిండర్ల లారీ ఇన్నోవాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు, గాయపడిన వారు సికింద్రాబాద్ సీతాఫల్ మండి వాసులుగా గుర్తించారు. వరంగల్ జిల్లా పోచన్నపేటలో బంధువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు తొమ్మిది మంది ఇన్నోవాలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *