Thursday, 5 November 2026

‘కోత’ అన్నది తెలియకుండా చేస్తాం: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణలో విద్యుత్‌ కోత అన్నది లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. ఇక్కడ జరిగిన సీఐఐ సదస్సులో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ త్వరలో రెండువేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయని, పరిశ్రమల ఏర్పాటుకు రాయితీల కోసం కేంద్రంతో మాట్లాడుతున్నామన్నారు. రాచకొండ గుట్టలో వేల ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయని ఎలక్ర్టానిక్‌ హార్డ్‌వేర్‌, చిత్రనగరికి ఈ భూములు కేటాయిస్తామని వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరులో ఫార్మాసిటీ కోసం భూమి సేకరిస్తున్నామని, గ్రేటర్‌ హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో లక్షన్నర భూముల ఎకరాల ఉన్నాయని పేర్కొన్నారు. దక్షిణ, ఉత్తర విద్యుత్‌ గ్రిడ్‌లు అనుసంధానమైతే 24గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ అందిస్తామని సీఎం వివరించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *