.
వరంగల్ ఈస్ట్, మార్చి 15 (జనం సాక్షి)అందరినీ పలకరిస్తూ ఇంటింటికి గడపగడపకు తిరుగుతూ వారి మంచి చెడు అడుగుతూ ముందుకు సాగింది మాజీ మంత్రి కొండ సురేఖ. పాదయాత్రలో భాగంగా వరంగల్ లోని 40 వ డివిజన్లో ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వారికి కావలసిన అవసరాలని అడుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అన్ని సమస్యలు తీరుతాయని విషయాలను ప్రజలకు వివరించింది మాజీ మంత్రి కొండా సురేఖ. ప్రజలు కూడా సురేఖ రాకతో తమ బాధలు తమకు కావలసిన విషయాలను వివరించారు. అంతకుముందు ఉరుసు బొడ్రాయి వద్ద గల శ్రీ శివాంజనేయ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మీసాల ప్రకాష్, నల్గొండ రమేష్, ఎండి అత్తర్, రాందేవ్, షేర్ల కిషోర్, కొత్తపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




