Tuesday, 3 November 2026

రాష్ట్రపతి భవన్ కుమహబూబాబాద్ జిల్లా విద్యార్థులు

-ఫేష్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ కు ఇద్దరు విద్యార్థులు
-నక్క భవాని, ఎడ్ల నాని లకు శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ శశాంక

మహబూబాబాద్ బ్యూరో-మార్చి15(జనంసాక్షి)

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఏప్రిల్ 10నుండి 13వరకు నిర్వహించబోయే ఇన్స్పైర్ మనక్ 9వ జాతీయ అవార్డుకు మహబూబాబాద్ జిల్లాకు చెందిన నక్క భవాని, ఎడ్ల నాని లు ఎంపిక అయ్యారు. వీరిద్దరు రాష్టపతి భవన్ డిల్లీ లో నిర్వహించబడే ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ ప్రేన్యూర్షిప్ 2023 కార్యక్రమంలో పాల్గొననున్నారు. జాతీయ స్థాయిలో ఎంపిక చేయబడిన 60 ఎగ్జిబిట్స్ లలో మహబూబాబాద్ జిల్లా విద్యార్దులు స్థానం సంపాదించినారు. తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపిక కాబడిన 8 ప్రదర్శనలలో మన జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్దులు ఎంపిక కావడం విశేషం అని ఈ సందర్భంగా విద్యార్దులను, గైడ్ టీచర్లను వారి తల్లిదండ్రులను జిల్లా కలెక్టర్ కె.శశాంక శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా విద్యాశాఖాధికారి రామారావు, జిల్లా సైన్స్ అధికారి జి.అప్పారావులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.