హైదరాబాద్ : పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా మాట్లాడేందుకు ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోరినప్పటికీ పట్టించుకోలేదని టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తమ వాదనలు వినిపించే అవకాశం లేని కారణంగానే పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు దూరంగా ఉన్నామన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. అలాగే బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా టీడీపీ ఉద్యమిస్తే కేసీఆర్ పట్టించుకోలేదని, బాబ్లీ కారణంగానే ఉత్తర తెలంగాణకు చుక్కనీరు దక్కడం లేదని విమర్శించారు. మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టులపై టీడీపీ ముందే పోరాడిందని.. బాబ్లీపై పోరాటం చేస్తే కేసీఆర్ అపహాస్యం చేశారని పేర్కొన్నారు. స్పీకర్ తమ హక్కులను కాపడడంలో విఫలమయ్యారని చెప్పారు.




