హైదరాబాద్, (మార్చి 3): హైదరాబాద్‌లోని కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో మూడు గంటలుగా విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. దీంతో ఆస్పత్రి మొత్తం అంధకారంలో మునిగి పోయింది. విద్యుత్ సరఫరా లేకపోవడం, జనరేటర్లు పని చేయక పోవడంతో ఆస్పత్రిలోని రోగులు తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు. గర్భవతులు, పసిపిల్లలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్‌ను వెంటనే పునరుద్ధరించాలని రోగుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు.




