ఈ ఏడాది జూన్ లోగా తాత్కాలిక రాజధాని నిర్మాణం సాధ్యం కాదని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఉద్యోగసంఘాలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఇప్పటి వరకూ రైతులు స్వచ్ఛందంగా 32 వేల ఎకరాలను రాజధానికి ఇచ్చారని ఆయన తెలిపారు. వై.ఎస్.జగన్‌కు తుళ్లూరులో రాజధాని రావడం ఇష్టం లేదని ఆయన ఆరోపించారు. భూసమీకరణ జరిగిన తర్వాత జగన్ ఆ ప్రాంతంలో పర్యటించడం ఎందుకని మంత్రి నారాయణ ప్రశ్నించారు.




