విశాఖపట్నం, మార్చి 3: జిల్లాలోని పరవాడ మండలం, తానంలో గుర్రాలు, జనంపైకి దూసుకెళ్లాయి. గ్రామదేవత పండుగ సందర్భంగా గుర్రపు పందాలు నిర్వహించారు. ఈ పందాల్లో రెండు గుర్రాలు జనం మీదకి వెళ్లాయి. దీంతో ముగ్గురు గాయపడ్డారు. గుర్రాలు జనాన్ని చూసి బెదరడం వల్లే జనం మీదకి దూసుకెళ్లాయని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.




