Wednesday, 4 November 2026

అంధత్వ నివారణకు కృషి చేయాలి

ఉప్పల్‌ : అంధత్వ నివారణకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని యునెస్కో కలింగ అవార్డు గ్రహీత డాక్టర్‌ బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఆదివారం ఉప్పల్‌ ఎన్‌జీఆర్‌ఐలో ప్రపంచ కాంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని జనవిజ్ఞాన వేదిక, ఆల్‌ఇండియా ప్యూపుల్‌ సైన్స్‌ నెట్‌వ ర్క్స్‌, తెలంగాణ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ సంయుక్తంగా నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నప్పటికీ అది పేదలకు చేరడం లేదన్నారు. దేశంలో 30 శాతం ప్రజలు రేచీకటి, అంధత్వ సమస్యలతో బాధపడుతున్నారని, వారికి అతి తక్కువ ఖర్చుతో, చిన్న ఆపరేషన్లతో చూపును ప్రసాదించొచ్చన్నారు. అంతకుముందు సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ మోహన్‌రావు మాట్లాడారు. కార్యక్రమంలో ఆల్‌ ఇండియా ప్యూపుల్స్‌ సైన్స్‌ నెట్‌వర్క్స్‌ అధ్యక్షుడు డాక్టర్‌ సవ్యసాచి చటర్జీ, జాతీయ ప్రధాన కార్యదర్శి రమేష్‌, తెలంగాణ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ నుంచి ప్రొఫెసర్‌ బిఎన్‌రెడ్డి, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ లక్ష్మారెడ్డి, విజ్ఞాన్‌ ప్రసాద్‌ శాస్త్రవేత్త వెంకటేశ్వరన్‌లతో పాటు శాస్త్రవేత్తలు, సైన్స్‌ టీచర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *