Wednesday, 4 November 2026

నెక్లెస్‌ రోడ్‌లో ఫార్మావాక్‌ ఆకట్టుకుంది

ఖైరాతాబాద్‌: నెక్లెస్‌ రోడ్‌లో ఆదివారం నిర్వహించిన ఫార్మావాక్‌ ఆకట్టుకుంది. 25న ప్రపంచ ఫార్మాసిస్ట్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ఫార్మాసొసైటీ ఆధ్వర్యంలో జలవిహార్‌ నుంచి నెక్లెస్‌రోడ్‌ వరకు, తిరిగి జలవిహార్‌ వరకు వాక్‌ నిర్వహించారు. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ఆఫ్‌ న్యూట్రిషన్‌డిఫ్యూటీడైరెక్టర్‌ డాక్టర్‌ రాజేంద్రన్‌ వాక్‌ను ప్రారంభించారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. సొసైటీఅధ్యక్షుడు డా.సంజయ్‌రెడ్డి మాట్లాడుతూ, 1945 ఔషధచట్టాన్ని ఇతర రాష్ట్రాల్లో అమలుచేస్తున్నా తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయడం లేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *