Wednesday, 4 November 2026

టీఎస్‌టీడీసీకి జాతీయ పర్యాటక అవార్డు

హైదరాబాద్‌ : గోల్కొండ కోటలో ఫ్రెండ్లీ గోల్ఫ్‌ కోర్టు టూరిజం అభివృద్ధి చేసినందుకుగానూ తెలంగాణ టూరిజం కార్పొరేషన్‌(టీఎస్‌టీడీసీకి)కు జాతీయ పర్యాటక అవార్డు లభించింది. పబ్లిక్‌-ప్రైవేటు భాగస్వామ్యంలో హైదరాబాద్‌ గోల్ఫ్‌ అసోసియేషన్‌ సౌజన్యంతో కోటలో కార్పొరేషన్‌ గోల్ఫ్‌ టూరిజాన్ని అభివృద్ధిచేసింది. అవార్డును కేంద్ర పర్యాటకశాఖ మంత్రి మహే్‌షశర్మ సమక్షంలో భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా టీఎస్‌టీడీసీకి ఎండీ క్రిస్టినా చొంగ్దు శుక్రవారం అందుకున్నారు. గోల్కొండ గోల్ఫ్‌ కోర్టులో పర్యాటకులు క్రీడను ఆస్వాదించేందుకు కావాల్సి న సకల సదుపాయాలను కార్పొరేషన్‌ అభివృద్ధి చేసింది. గోల్ఫ్‌కోర్టు శుభ్రతకు పెద్దపీట వేసింది. భద్రతాపరంగా తగిన జాగ్రత్తలు తీసుకుంది. మిగతా గోల్ఫ్‌కోర్టులతో పోలిస్తే రుసుము కూడా తక్కువగా వసూలు చేస్తుండడంతో టీఎ్‌సటీడీసీ గోల్ఫ్‌టూరిజం విభాగంలో అవార్డుకు ఎంపికైంది. ఎండీ వెంట హైదరాబాద్‌ గోల్ఫ్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎన్‌. రమే్‌షరెడ్డి కూడా ఉన్నారు. అదేవిధంగా మెడికల్‌ టూరిజం కింద అపోలో ఆసుపత్రులకు, లియోనియా కన్వెన్షన్‌ సెంటర్‌కు జాతీయ పర్యాటక అవార్డులు లభించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *