Tuesday, 3 November 2026

అంధుడైన అన్వర్ పాషాకు ఆర్థిక సాయం చేసిన రాజమాత ఫౌండేషన్

అంధుడైన అన్వర్ పాషాకు ఆర్థిక సాయం చేసిన రాజమాత ఫౌండేషన్

ఘట్కేసర్ జనవరి 2 జనం సాక్షి రాజమాత ఫౌండేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందరో అభ్యాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపింది…నింపుతోంది. కొత్త ఏడాది జనవరి ఒకటో తారిఖునే అన్వర్ పాషా జీవితాల్లో వెలుగులు నింపింది రాజమాతా ఫౌండేషన్. 2023 న్యూ ఇయర్ లోనూ అంతం కాదు ఇది..ఆరంభం అంటూనే అంధుడైన అన్వర్ పాషా కు జీవనోపాధిని కల్పించింది. అపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న వారికి రాజమాత ఫౌండేషన్ జీవన జ్యోతి వలే కనిపించింది. పేదల కష్టాలను తెలుసుకుని మేమున్నామంటూ ముందుకు వచ్చి సాయం చేసింది.

అన్వర్ పాషా కు స్వయం ఉపాధి కోసమై కిరాణా షాపు సరుకుల నిమిత్తం 25 వేలు అందజేస్తామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం తొలి విడుతగా ఫౌండేషన్ సభ్యులు 15 వేల రూపాయలు అందజేశారు. మిగతా10 వేలు త్వరలోనే అందజేస్తామని ఫౌండేషన్ ఫౌండర్ ఉదయ రెడ్డి హామీ ఇచ్చారు. తనకు కిరాణా షాప్ పెట్టించిన అన్వర్ పాషా, దివ్యాంగుల కాలనీలో ఉపాధి పొందిన వారందరూ శ్రీ రాజమాత ఫౌండేషన్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాదు కాలేజీ ఫీజు చెల్లించలేని ఓ విద్యార్థినికి సాయం చేసింది. ఘట్కేసర్ లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న నిరు పేదరాలైన అస్కని యాదమ్మ కుమార్తె పైచదువులకు కాలేజీ ఫీజు కట్టలేని స్థితిని గుర్తించింది రాజమాత ఫౌండేషన్ ఆమె కూతురు అస్కని యమున చదువుకు అయ్యే కాలేజీ ఫీజు 5 వేల రూపాయలు రాజమాత ఫౌండేషన్ చెల్లిస్తుందని భరోసా కల్పించారు. అందులో 3వేల రూపాయలు ఫీజు కట్టి విద్యార్థిని యమునకు రసీదు ఇవ్వడం జరిగింది. త్వరలోనే మిగితా 2 వేల రూపాయల ఫీజు కడతామని తెలిపారు. విద్యార్థినీ తల్లి యాదమ్మ కు జీవనోపాధి కల్పించేందుకు కుట్టు మిషన్ రాజమాత ఫౌండేషన్ అందజేసింది. అలాగే 150 మంది దివ్యాంగుల పిల్లలకు పానీపూరి, గప్ చిప్ లు ఇప్పించి చిన్నారుల మోముల్లో సంతోషం వెల్లువిరిసేలా చేశారు. ఇటీవల అంతర్జాతీయ వికలాంగ దినోత్సవ సందర్భంగా చలి విపరీతంగా పెరిగిన కారణంగా నిరుపేదలైన అన్నోజిగూడ దివ్యాంగులకు 225 దుప్పట్లు పంచి పెట్టి వారి ఔదార్యాన్ని చాటుకున్నారు. అలాగే వితంతు దివ్యాంగ మహిళలకు కుట్టు మిషన్లు అందజేసి వారికి చేయూతనందించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు యన్ రాములు గౌడ్, ఉపాధ్యక్షుడు గంగు తిరుపతిరెడ్డి, యు ఎల్ బి ఫిజికల్లీ చాలెంజ్డ్ పర్సన్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆకుల లింగమల్లు, రాజు, మాధవి, శ్రీను, సీనియర్ జర్నలిస్టులు భూతం లింగయ్య యాదవ్, మొక్క ఉపేందర్, తదితరులు పాల్గొని ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేశారు.