Thursday, 5 November 2026

అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించిన ఎస్సై ఏమిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి

 

 

 

 

 

 

మోత్కూరు ఏప్రిల్ 15 జనం సాక్షి : డా.బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా మున్సిపాలిటీ కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహానికి మోత్కూరు ఎస్సై ఎమిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి తన పోలీస్ సిబ్బంది తో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ ఐడియాలజితో నేటి యువత దేశ హితం కోసం ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీశైలం, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, హుస్సేన్,మహేష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.