Thursday, 5 November 2026

అంబేద్కర్ 66వ వర్ధంతి

అంబేద్కర్ 66వ వర్ధంతి

రాజాపేట,  డిసెంబర్6 (జనం సాక్షి): డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్బంగా అంబేద్కర్ విగ్రహానికి మండల కేంద్రంలో మంగళవారం ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహనీయుని ఆశయ సాధనకు అందరూ కలిసి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు చింతల దేవదాస్, ఉపాధ్యక్షులు మల్యాల భరత్, ప్రధాన కార్యదర్శి చింతల సాయికుమార్, స్థానిక సర్పంచ్ ఆడెపు ఈశ్వరమ్మా శ్రీశైలం, మాజీ ఎంపీటీసీ ఎర్రగోకుల కృష్ణ, బీజేపీ యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షులు ఉట్కూరి అశోక్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నేమీల మహేందర్ గౌడ్, వార్డు మెంబెర్ ఎర్రగొకుల జశ్వంత్, విజిలెన్స్ బోర్డు మెంబర్ సందిల భాస్కర్ గౌడ్, కుమ్మరి లక్ష్మణ్, చింతల కిష్టయ్య, కూతురు లింగం, ఎర్రగోకుల హనుమంత్, ఎర్రగోకుల వినోద్, NRN ఫౌండేషన్ ఎర్రగోకుల నాగార్జున, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జుకంటి ప్రవిణ్, కోఆపారేటివ్ వైస్ ఛైర్మన్ కాకళ్ల ఉపేందర్, సంగెం మధు, ఎర్రగోకుల చంద్రయ్య,బిర్రు సురేష్, మెకానిక్ నరేందర్, గజంహరి, గవ్వల సిద్దేశ్వర్, కొత్త సదానందం, మ్యాదరి ప్రవీణ్, గొల్లపల్లి రాజు, తదితరులు పాల్గొన్నారు