Thursday, 5 November 2026

ఘనంగా డా బీఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

ఘనంగా డా బీఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

ఆత్మకూర్ (ఎం) డిసెంబర్ 6 (జనంసాక్షి) భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా స్థానిక మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు మహిళల అభ్యున్నతికి కృషి చేసిన అపర విజ్ఞాన కోవిదుడు భారత రత్న అవార్డు గ్రహీత స్వర్గీయ భీమ్ రావ్ బాబా సాహెబ్ అంబేద్కర్ సేవలను స్మరిస్తూ వారి ఆశయ సాధనే లక్ష్యంగా తమ సేవలు ఉంటాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తండ మంగమ్మ శ్రీశైలం గౌడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యాస లక్ష్మారెడ్డి ఎస్సీ సెల్ అధ్యక్షులు ఏనూతల నగేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్దసాని సిద్దులు బీసీ సెల్ అధ్యక్షులు కట్టెకోల హన్మంతు గౌడ్ పట్టణ శాఖ కాంగ్రెస్ అధ్యక్షులు పోతగాని మల్లేశం మండల నాయకులు ఎద్దు వెంకటేశ్వర్లు పరకాల అంజయ్య గౌడ్ బూత్ ఎన్రోలర్ రంగ స్వామి యూత్ కాంగ్రెస్ నాయకులు చిత్తర్ల అనిల్ తదితరులు పాల్గొన్నారు