Thursday, 5 November 2026

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిహారం అందజేయాలి.

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిహారం అందజేయాలి.టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి.
కోటగిరి మార్చ 21 జనం సాక్షి:-అకాల వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల ఎకరాలలో పంట నష్టం వాటిల్లిందని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.సోమవారం రోజున బాన్సువాడ నియోజక వర్గంలో కొనసాగుతున్న హత్ సే హాత్ జొడో కార్యక్రమంలో భాగంగా యాత్ర ఫర్ చేంజ్గా ఉమ్మడి కోటగిరి మండలంలోని సుంకినీ గ్రామంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటను ఆయన సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.గత మూడు రోజులుగా రాష్ట్రంలో అకాల వర్షాలు,వడగళ్ల వానలు కురవడంతో సుమారు ఐదు లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగిందన్నారు.ఈ అకాల వర్షాలు సృష్టించిన బీభత్సానికి మామిడి తోటలు,మొక్కజొన్న ఇతరేతర పంటల రైతాంగానికి తీరని ఆవేదనను మిగిల్చిందన్నారు.ఎప్పుడైనా ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు తక్షణమే సంబంధిత వ్యవసాయ,రెవెన్యూ శాఖ అధికారులు ఏఏ పంటలు ఎంత మొత్తంలో దెబ్బతి న్నాయి అనే అంశాలను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వాలి.ఒకవేళ పంట తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు రాష్ట్ర నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి పంపించి తక్షణమే సహయక చరులను తీసుకోవాలి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న 50 ఏళ్లు రైతులకు కరువు,వరద,వడగళ్ళు,అకాల వర్షాలు సంభవించి ఎలాంటి నష్టం జరిగినా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో రైతులకు నష్టపరిహాన్ని అందజేయ డం జరిగిందన్నారు.అలాగే ఎరువులు,విత్తనాలు, పనిముట్లూ,స్ప్రింక్,డ్రిప్పుల విషయంలో సబ్సిడీలు ఇవ్వటం,పంట నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీలు అమ లు చేయడం వంటి అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో జరిగాయన్నారు.అలాగే రైతులకు పంట బీమా పథకాన్ని అమలు చేసి ఆదుకున్నామన్నారు.కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం వీటినన్నింటిని గాలికి వదిలేసి రైతుబంధు రైతు బీమా ఇస్తున్నామని ప్రజలను మభ్యపెడుతు, ఇక ఇవే రైతులకు సర్వరోగ నివారిణి అని ప్రేలాపన ఆలోచనలు చెప్పడం సిగ్గుచేటన్నారు.ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పంటల భీమాను అమలు చేయక పోవడం వల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నా రు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజన పథకానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను చెల్లించక ఇటు సొంత రాష్ట్రంలో బీమా సంస్థలకు ప్రోత్సహించి ఇన్సూరెన్స్ ను కట్టక రైతులను అయోమయ పరిస్థితికి గురి చేస్తుందన్నారు.2021 డిసెంబర్ 30 న బాన్సువాడ నియోజకవర్గ ఉమ్మడి కోటగిరి మండలంలో అకాల వర్షాల కారణంగా 8 వేల ఎకరాలలో పంట నష్టం జరిగితే ఇప్పటికీ కూడా ఆ రైతులకు ఆదుకొక నష్ట పరిహారం అందజేయక రాష్ట్ర ప్రభుత్వం మీనమేశాలను వేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు రుణ మాఫీ చేస్తామని చెప్పి నేడు రైతులను అదే రుణమాఫీ విషయమై వీధుల్లోకి లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తి స్థాయి లో రుణమాఫీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ఎకరాల లో పంట నష్టం వాటిల్లింది.రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే  గ్రామ గ్రామాన జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి నివేదికలను తెప్పించి తక్షణమే ఎకరానికి 15 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.ఇవే నివేదికలను కేంద్ర ప్రభుత్వాని రాష్ట్ర మంత్రులు తీసుకువెళ్ళి కేంద్ర వ్యవసాయ శాఖ ద్వారా రాష్ట్ర రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీలు అందేలా కృషి చేయాలని అన్నారు.అందుకుగాను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ అంశాన్ని పార్లమెంట్లో ఘలాన్ని వినిపిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి బిజెపిగా ఉన్న నలుగురు ఎంపీలు ఉత్సహా విగ్రహాలుగా ఉండడం తప్పిస్తే రాష్ట్రానికి ఇలాంటి ఉపయోగం లేదనీ హెగ్దేవ చేశారు.రాష్ట్రం నుండి కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఇప్పటివరకు అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను,ఆవేదంలో ఉన్న రైతులను పలకరించక పోవడం సిగ్గుచేటన్నారు.తెలంగాణ సమాజమంటేనే రైతులు,తెలంగాణ సంస్కృతి అంటేనే వ్యవసాయం కానీ నేడు 5 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగి రైతులు అన్నమో రామచంద్ర అని ఏడుస్తు,ఆవేదన తో భాదతీరక దీనావస్థలో రైతులు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం వారిని గాలికి వదిలేసినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నలుగురు బిజెపి ఎంపీలు ఎందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తాలేరు, రైతులను మాట్లాడటం లేదనీ అన్నారు.ఎంతసేపు వివాదాస్పద వ్యాఖ్యలు మాట్లాడటం,ప్రజలను రెచ్చగొట్టడం,మతాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప తెలంగాణ రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాల్సి న బాధ్యత ఈ నలుగురు ఎంపీలకు లేదా అని ప్రశ్నించారు.కాబట్టి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల విషయంలో పూర్తిస్థాయిలో విఫలమై,తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్య పెరిగిపోతుందన్నారు. 2021సం.లో ఉమ్మడి కోటగిరి మండలంలో 8 వేల ఎకరాలు,రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 లక్షల ఎకరాలలోని పంట నష్ట పరిహారానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పుడు జరిగిన 5 లక్షల ఎకరాల పంటనష్టం మొత్తాన్ని రాష్ట్ర బృందాలు పరిశీలించా లి.ముఖ్యంగా మొక్కజొన్న,పొద్దుతిరుగుడు,కుసు మలు నేలకు ఒరగడం,మామిడి తోటల పూతలు రాలిపోవడం వంటి పరిస్థితి రైతులకు అగమ్యగొరా నికి గురి చేసిందన్నారు.కావున తోటల రైతులకు ఎకరానికి 50 వేల రూపాయల నష్ట పరివారం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ఆదుకోవాలన్నారు.అదేవిధంగా తక్షణమే ఈ నివేదిక లను తయారుచేసి రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు తెలంగాణ రైతాంగానీ ఆదుకోవాల్సిం దిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీలు మల్లు రవి,రాజయ్య, మాజీ మంత్రి షబ్బీర్ అలీ,నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి,మాజీ అద్యక్షులు నరేంద్ర రెడ్డి,జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గంగారం,నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గంగాధర్ దేశాయ్,బాన్సువాడ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ బాధ్యులు కాసుల బాలరాజు,మాజీ జడ్పిటిసి పుప్పాల శంకర్,మాజీ ఎంపీపీ,పిఎసిఎస్ పోతంగల్ వైస్ చైర్మన్ గంధపు పవన్,మాజీ ఎంపిటిసి హనుమంతు,మాజీ సర్పంచ్ మల్గొండ,నియోజకవర్గ,ఉమ్మడి కోటగిరి మండల సీనియర్ నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.