Thursday, 5 November 2026

రైతులకు అందే సేవలలో అంతరాయం కలగకూడదురైతులకు అందే సేవలలో

 అంతరాయం కలగకూడదుడిసిఒ సింహాచలం
కోటగిరి మార్చి 20జనం సాక్షి:-మండల కేంద్రంలోని కొత్తపల్లి సొసైటీని సోమవారం నిజామాబాద్ జిల్లా డిసిఓ సింహాచలం సందర్శించి సొసైటీ పాలక వర్గం, సిబ్బంది,రైతులతో ప్రాథమిక విచారణ చేపట్టారు. కొత్తపల్లి సొసైటీలో నిధులు దుర్వినియోగం అయినట్లు వచ్చిన ఆడిట్ రిపోర్ట్ ఆధారంగా సొసైటీలో సహకార చట్టం సెక్షన్ 51 కింద విచారణ జరపాలని పాలకవర్గం తీర్మానం చేసిన విషయం విదితమే.ఈ రిపోర్ట్ లో సిబ్బంది హస్తం కూడా ఉందన్న ఆరోపణలతో సిబ్బందికి,పాలకవర్గానికి మధ్య తలెత్తిన వివాదం కారణంగా సిబ్బంది శనివారం నుండి విధులకు గైర్హాజరయ్యారు.ఈ విషయమై స్థానికంగా చర్చనీ అంశంగా మారడంతో పాటు పలు వార్త పత్రికల్లో రావడంతో స్పందించిన డిసిఓ సోమవారం సొసైటీని సందర్శించారు.ఈ సందర్భంగా సొసైటీ పాలకవర్గం సిబ్బందితో ఆయన మాట్లాడి జరిగిన విషయాలను తెలుసుకున్నారు. అనంతరం పాలకవర్గం కోరిక మేరకే సెక్షన్ 51 కింద విచారణ జరిపిస్తామని అప్పటివరకు సహకార సంఘ విధులు యధావిధిగా కొనసాగాలని సిబ్బంది పాలకవర్గానికి డిసిఒ సూచించారు.రైతులకు అందే సేవలలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసే బాధ్యత పాలకవర్గంపై ఉంటుందని సిబ్బంది కూడా సహకరించాలని ఆయన ఈ సందర్భగా అన్నారు.ఈ విచారణ అనంతరం తప్పు చేసిన వారిపై చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు.