జనంసాక్షి , మంథని : మంథని నియోజకవర్గంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల చేతికి వచ్చిన పంట కోతలకు గురయ్యిందని, ఐకేపీ సెంటర్ కు తరలించిన ధాన్యము మరియు కోతకు వచ్చిన పంట నేలకొరగడం జరిగిందని, ఆరపోసిన ధాన్యం వర్షాలకు కొంత కొట్టుకపోవడమే కాక, ధాన్యం మొలకెత్తడం మూలముగా రైతులు కోలుకోలేని నష్టము జరిగిందని సిపిఐ మంథని నియోజక వర్గ కార్యదర్శి గౌతం గోవర్దన్ అన్నారు. మంగళ వారం సిపిఐ ఆధ్వర్యంలో మంథని తహశీల్దార్ బండి ప్రకాష్ కు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పై వినతి పత్రం ఇచ్చిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ మార్కెట్ లో మొలకెత్తిన ధాన్యమును కొనడానికి వెనుకాడడమే కాకుండా, రైస్ మిల్లులు తరుగు పేరుతో క్వింటాలుకు నాలుగు, ఐదు కిలోల తరుగు పేరుతో తీసివేయడం, రైతులను దగా చేయడమేనని ఆయన అన్నారు. ఆరు కాలము కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయములో అకాల వర్షాల వల్ల రైతులకు చాలా నష్టము జరిగిందని ఆయన పేర్కొన్నారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వపరంగా నష్టపరిహారం చెల్లిస్తూ తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండు చేస్తూ సి.పి.ఐ. ప్రతినిధి వర్గము తో కలిసి మంథని తహాశీల్దార్ కు వినతి పత్రము సమర్పించడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మంథని నియోజక వర్గం నాయకులు కొవ్వూరి రాయలింగు, పోరెడ్డి వెంకట్ రెడ్డి
యాపచెట్టి రాజన్న,
రౌతు మల్లయ్య, డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు.




