భైంసా రూరల్ మే 09 జనం సాక్షినిర్మల్ జిల్లా మంగళవారంబైంసా కుంట ఏరియా ఏర్పాటు చేసిన మహిళా ఆరోగ్య కేంద్రం, పురాన బాజర్ గల్లీ లోని కంటివెలుగు కేంద్రాలను సందర్శించిన జిల్లా పాలనాధికారి వరుణ్ రెడ్డి.మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఆరోగ్య మహిళా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా పాలనాధికారి వరుణ్ రెడ్డి అన్నారు.మంగళవారం బైంసాలోని కుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళా కేంద్రాన్ని సందర్శించి మహిళలు ఆరోగ్య కేంద్రానికి వచ్చి పరీక్షలు చేయించుకునేలా చూడాలని వైద్యాధికారులకు సూచించారు.ప్రత్యేకంగా పలువ్యాధుల పై అవగాహన కల్పించాలని,ప్రతి మంగళవారం మహిళఆరోగ్య కేంద్రాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.మహిళల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధవహిస్తూ ప్రత్యేకంగా ఆరోగ్య మహిళ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఇందులో ప్రతీ మంగళవారం మహిళలకు ప్రత్యేక ఓపీని ఏర్పాటు చేసి మహిళలకు సంబంధించి క్యాన్సర్ స్క్రీనింగ్, ఓరల్ కాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, డయా గ్నోస్టిక్ , సూక్ష్మపోషక లోపాలు , మూత్ర నాళిక ఇన్ఫెక్షన్స్ , పీసీవోడీ ,ఎస్టి ఐ , స్త్రీల శరీర బరువు నిర్వహణ తదితర మహిళల వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు.
ప్రతి వారం మహిళలు ఆరోగ్య కేంద్రానికి వచ్చేలా ఆశ, ఏ ఎన్ ఎం లు సమీకరించాలని, రిజిస్టర్ ఏర్పాటు చేసి పేర్లు నమోదు చేసుకోవాలని అన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల పై ఆశాలు , ఏ ఎన్ ఎం లు ప్రతి ఇంటికి వెళ్లి మహిళలకు పూర్తిగా అవగాహన కల్పించాలని ప్రతి ఆశ ప్రతి ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకొని ముందే స్కీన్ చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చి ట్రీట్ మెంట్ అందేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. 8 రకాల వ్యాదుల పై మహిళా వైద్య
ఆధికారులు మహిళలకు తీసుకోవలసిన జాగ్రత్త ల పై అవగాహన కల్పించాలని అన్నారు.
అనంతరం బైంసా లోని పురానా బాజార్ గల్లీ లో ఏర్పాటు చేసిన కంటివెలుగు కేంద్రాన్ని సందర్శించి రిజిస్టర్ లు తనిఖీ చేశారు.
కంటి పరీక్షల కొరకు వచ్చే వారికి ఇబ్బందులు
తలెత్తకుండా చూడాలని అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అన్నారు.
ఈ కార్యక్రమం లో ఎమ్మార్వో చంద్రశేఖర్ రెడ్డి, వైద్యాధికారులు, ఏఎన్ఎం లు ఆశవర్కర్ లు , తదితరులు పాల్గొన్నారు.




