అక్బరుద్దీన్‌కు రిమాండ్‌ పొడిగింపు

నిజామాబాద్‌: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కి నిజామాబాద్‌ కోర్టు విధించిన రిమాండ్‌ ఈరోజుతో ముగిసింది. దాంతో పోలీసులు ఆయనను కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం అక్బరుద్దీన్‌కు ఈ నెల 12 వరకు రిమాండ్‌ పొడిగించింది. 12న తిరిగి ఆయనను కోర్టులో హాజరు పరచాలని, అదే రోజున స్వర నమోదు కూడా చేయాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు.