లక్నో : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఈరోజు మంత్రివర్గాన్ని విస్తరించారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి చేపట్టిన ఈ విస్తరణలో 12 మంది కొత్తవారికి చోటు లభించింది. గతంలో మంత్రిగా ఉండి ఓ వైద్యాధికారిపై చేయి చేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొని పదవికి రాజీనామా చేసిన వినోద్‌కుమార్ సింగ్‌కి తిరిగి మంత్రివర్గంలో చోటు కల్పించారు. అఖిలేశ్ తెలియజేశారు.




