Tuesday, 3 November 2026

అక్బరుద్దీన్‌కు రెండురోజుల కస్టడీ

నిజామాబాద్‌, జనవరి 30 (): మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీపై దాఖలైన పిటి వారెంట్‌పై కస్టడీ కోరిన పోలీసులకు బుధవారం జిల్లా జడ్జి రెండురోజుల పాటు అనుమతించింది. నగర పోలీసు అధికారి సైదులు అక్బరుద్దీన్‌ను ఏడు రోజులపాటు పోలీసు కస్టడీకి అప్పగించాలని గత రెండు రోజుల క్రితం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. బుధవారంనాడు పిటిషన్‌ విచారించిన ఇన్‌చార్జి పస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ రాధాకృష్ణచౌహన్‌ పిటిషన్‌ స్వీకరించి తీర్పు ఇచ్చారు. ఫిబ్రవరి 1, 2 తేదీల్లో అక్బరుద్దీన్‌ను పోలీసు కస్టడీకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా అక్బరుద్దీన్‌ తరఫున బెయిల్‌ విటిషన్‌ వేసిన న్యాయవాదుల పిటిషన్‌ను ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *