Tuesday, 3 November 2026

నేడు సహకార ఎన్నికలు… పోలింగ్‌ కేంద్రాలకు తరలిన సిబ్బంది

నిజామాబాద్‌, జనవరి 30 (): మొదటి విడత సహకార సంఘాల ఎన్నికలకు జిల్లా అధికార పోలీసు యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది. గురువారంనాడు జరిగే మొదటి విడత ఎన్నికల పోలింగ్‌ సామాగ్రిని పోలింగ్‌ సిబ్బంది గట్టి బందోబస్తు మధ్య పోలింగ్‌ కేంద్రాలకు తరలించారు. జిల్లాలో 142 సహకార సంఘాలకు రెండు విడతలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో 74 సంఘాలకు 10 సంఘాలు, ఏకగ్రీవమయ్యాయి. మరో 64 సంఘాలకు గురువారం ఎన్నికలు జరగనున్నాయి. గురువారం ఉదయం ఏడు నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని, మధ్యాహ్న భోజన అనంతరం ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి జరుగుతుందని జిల్లా సహకార అధికారి తెలిపారు. మరుసటి రోజు చైర్మన్‌, ఉప చైర్లన్‌లను డైరెక్టర్లు ఎన్నుకుంటారని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *