Tuesday, 3 November 2026

విలేకరి ఆత్మహత్యపై జేఏసీ నాయకుల మౌన ప్రదర్శన

నిజామాబాద్‌, జనవరి 30 (): నల్గొండ జిల్లా భువనగిరిలో తెలంగాణ కోసం ఆత్మహత్యకు పాల్పడిన రాములనే విలేకరికి జేఏసీ నాయకులు నివాళులర్పించారు. బుధవారం ధర్నాచౌక్‌లో జేఏసీ నాయకులు గోపాల్‌శర్మ, ప్రభాకర్‌, భాస్కర్‌, రాము, పిడిఎస్‌యు విద్యార్థులు నల్లబ్యాడ్జిలు ధరించి విలేకరి మృతి పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా గోపాల్‌శర్మ మాట్లాడుతూ కాంగ్రెస్‌ విధానాల వల్లే ఆత్మబలిదానాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి తెలంగాణలోని మంత్రులు, ఎంపిలు తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణవాదులు ఎవరుకూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని, తెలంగాణ కోసం పోరాటమే శరణ్యమని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *