అక్బరుద్దీన్‌ స్వరనమూనా సేకరణ పూర్తి : రిమాండ్‌ పోడిగింపు

నిజామాబాద్‌: న్యాయమూర్తి సమక్షంలో అధికారులు ఐదు నిమిషాల పాటు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ స్వర నమూనా సేకరించారు. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అక్బరుద్దీన్‌కు ఈ నెల 26 వరకు న్యాయస్థానం రిమాండ్‌ పొడిగించింది. అక్బరుద్దీన్‌ బెయిల్‌ పిటిషన్‌పై వాదనలను ఈ నెల 14కి వాయిదా వేసింది.