Thursday, 5 November 2026

అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

బాల్కొండ డిసెంబర్ 16 (జనం సాక్షి ) బాల్కొండ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ గోపి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు నమ్మదగిన సమాచారం ప్రకారం బాల్కొండ నేషనల్ హైవే వద్ద నిషేధించబడిన గంజాయిని అక్రమంగా తీసుకొని వచ్చి బాల్కొండ యూత్ కు అమ్మి డబ్బులు చేసుకోవాలి వచ్చిన బోరిగం అదిలాబాద్ జిల్లా వాసి రాథోడ్ దూద్ రామ్,39 సంవత్సరాలు మండలం నేరేడిగొండ మండలానికి చెందిన అనే వ్యక్తిని పట్టుకోవడం జరిగిందని అతని వద్ద నుండి అరకిలో గంజాయిని స్వాధీనం పరుచుకొని కేసు నమోదు చేస్తూ జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు. గంజాయి పట్టి ఆపరేషన్ లో నిదుతుండి పట్టుకున్న ఏఎస్ఐ శంకర్. హెడ్ కానిస్టేబుల్ సాయిలు. సందీప్. డ్రైవర్ జలంధర్ ఉన్నారన్నారు.