Thursday, 5 November 2026

50 లక్షలు దాటిన దేవాలయ టెండర్లు.

50 లక్షలు దాటిన దేవాలయ టెండర్లు.
– ఉత్కంఠ భరితంగా సాగిన వేలం పాట.
ఊరుకొండ, డిసెంబర్ 16 (జనంసాక్షి):
ఊరుకొండ మండల పరిధిలోని ఊరుకొండ పేట శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి దేవాలయంలో రానున్న బ్రహ్మోత్సవాలకు సంబంధించి నిర్వహించిన టెండర్లు 50 లక్షలకు పైగా పలికాయి. స్వామివారి ఆలయంలో దేవాదాయ ఇన్స్పెక్టర్ వీణదరి, ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి, దేవాలయ కమిటీ సభ్యులు, సుదూర ప్రాంతాల నుండి వచ్చిన టెండర్ దారులు మరియు భక్తుల ఆధ్వర్యంలో టెండర్ల వేలంపాట ఉత్కంఠ భరితంగా సాగింది. టెండర్ల వివరాలు 01-01-2023 నుండి 31-12-2023 వరకు కొనసాగుతాయని ఆలయ అధికారులు పేర్కొన్నారు. కొబ్బరికాయల వేలం పాటలో వాస క్రిష్ణయ్య 14 లక్షలు పాడి సొంతం చేసుకున్నాడని, ఒక కొబ్బరికాయ 25 రూపాయలకు విక్రయించాలని సూచించారు. లడ్డు, ప్రసాదం వేలం పాటలలో 17 లక్షలు పాడి కుంబర్తి గోవర్థన్ సొంతం చేసుకున్నాడని, ఒక్కో లడ్డు 15 రూపాయలకు విక్రయించాలని సూచించారు.
పూజ సామాగ్రి 13 లక్షల 5వేల వేలం పాట పాడి వాస క్రిష్ణయ్య సొంతం చేసుకున్నాడు.
బైక్ ( పూజ సామాగ్రి రూ.100), కారు (పూజ సామాగ్రి రూ.200), గుమ్మడికాయ రూ.150, పూలదండ రూ.100 కు విక్రయించాలని సూచించారు. తలనీలాలు 3 లక్షల 10వేలు వేలంపాడి నిరంజన్ సొంతం చేసుకున్నాడని, కొబ్బరి చిప్పలు శంకర్ 3 లక్షల 55 వేలు వేలంపాడి సొంతం చేసుకున్నాడని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. టెండర్లలో మొత్తం రూ.50 లక్షల 70 వేల రూపాయలు వచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, దేవాలయ కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది, అర్చకులు, భక్తులు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.