మోత్కూరు ఏప్రిల్ 13 జనంసాక్షి : మోత్కూరు మండలంలోని పాటిమట్ల గ్రామం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా కలపను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను అనాజిపురం – పొడిచేడు గ్రామాల మధ్యలో బుధవారం రాత్రి అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శాలిగౌరారం మండలం ఎన్.జి. కొత్తపల్లి గ్రామానికి చెందిన రెండు కలప ట్రాక్టర్లను, చింత, వేప చెట్లను నరికి ఎలాంటి అనుమతులు లేకుండా బొగ్గు బట్టిలకు రాత్రి సమయంలో తరలిస్తుండగా, మండల అటవీ శాఖ అధికారి ఎల్లేష్ ఆ ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్ ల సహాయంతో పోలీస్ స్టేషన్ కు తరలించారు.




