Thursday, 5 November 2026

తోర్తి గ్రామంలో కంటివెలుగు శిబిరం ప్రారంభం

 

 

 

 

ఏర్గట్ల ఏప్రిల్ 12 (జనంసాక్షి) నిజామాబాద్ జిల్లాఏర్గట్ల మండలంలోని తోర్తి గ్రామంలో కంటివెలుగు శిబిరాన్ని బుధవారం ప్రారంభించినట్లు సర్పంచి కుండ నవీన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని గ్రామస్ధులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సల్ల లావణ్య, ఉప సర్పంచి తాహెర్ ఖాన్, మండల వైద్యాధికారిణి ప్రసన్న ప్రియ, పర్యవేక్షకుడు మారుతి గౌడ్, ఆరోగ్య సహాయకుడు పండరీ, ఏఎన్ఎం రాజహంస, ఆశాలు కర్ణ, సుశీల, అంగన్వాడీలు ప్రేమలత, లక్ష్మి, శైలజ తదితరులు పాల్గొన్నారు.