నెరడిగొండజనవరి16(జనంసాక్షి):రెండు లక్షల రూపాయలు విలువ చేసే19టేకు దుంగలను అక్రమంగా తరలిస్తున్న కలప తోపాటు రెండు వాహనాన్ని మండల అటవీశాఖ అధికారులు ఆదివారం రాత్రి ముందస్తు సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నారు.సోమవారం రోజున విలేకరుల సమావేశంలో అటవీశాఖ డివిజనల్ రేంజ్ అధికారి బర్నాల,బేజ్జం గణేష్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోనిబొరిగాం-వాస్తపూర్ అటవీ ప్రాంతం నుండి అక్రమంగా తరలిస్తున్నట్లు విశ్వసనీయత సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి ఎపి28X 8735 తోపాటు ఏపీ28 బిడబ్లు 0505 నంబర్లు గల వాహనాలపై అనుమానం వచ్చి వాహనాన్ని తనిఖీ చేయగా అందులో ఉన్న19 టేకు దుంగలు బయటపడ్డాయని పేర్కొన్నారు. పట్టుకున్నా రెండు వహనాన్ని దుంగలను స్థానిక రేంజ్ కార్యాలయానికి తరలించి అంచనా వేయగా రెండు లక్షల రూపాయల విలువగల టేకు దుంగలు ఉన్నట్లు వెల్లడించారు.అలాగే అక్రమ కలప రవాణాలో పట్టుబడిన ఐదుగురు నిజామాబాద్ కు చెందిన వ్యక్తులు జావిద్ ఖాన్, మిర్జ యహబ్,షేక్ ఆఫ్రోజ్,షేక్ శఫియోద్దీన్, పఠాన్ ఖాన్,సుల్తాన్ లను అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరిచారు.అటవీ ప్రాంతంలో చెట్లను అక్రమంగా నరికి కలప రవాణా చేయువారిని అటవీశాఖ చట్టం ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఇట్టి కలప పట్టుకున్నవారిలో బెజ్జంకి గణేష్ ఎఫ్ఎస్ఓ ముక్త్యార్ హైమద్ ఎఫ్బిఓలు భీంజి నాయక్ తదితరులు ఉన్నారు.
అక్రమంగా తరలిస్తున్న19 టేకు దుంగలు తోపాటు రెండు వాహనాలను సీజ్ చేసిన అటవీశాఖ అధికారులు.




